ePaper
Monday, July 27, 2026

రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్:
తెలంగాణ రోడ్లు & భవనాల (ఆర్&బీ) శాఖ చీఫ్ ఇంజనీర్ (ఇంజనీర్-ఇన్-చీఫ్) జే. బాలుకు సంబంధించిన నివాసాలు మరియు ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఒకేసారి తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులపై అందిన సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇంజనీర్‌పై గత కొంతకాలంగా వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయని, రోడ్డు నిర్మాణాలు మరియు ఇతర పనులకు సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో కమిషన్లు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని సమాచారం.

సోదాల్లో నగదు, బంగారం, వెండి వస్తువులు, విదేశీ మద్యం సీసాలు లభించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పూర్తి వివరాలపై ఏసీబీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయని, ఆస్తుల విలువ మరియు ఇతర వివరాలను అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అధికారిక నివేదిక వెలువడిన తర్వాత వెల్లడికానున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!