చీకటి వెలుగునల్గొండ .. వివిధప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని టి యు డబ్ల్యూ జె ( ఐ జె యూ ) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ
అధికారి సుశీందర్రావు రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయుచున్న జర్నలిస్టు పిల్లలు వివిధ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్నారని అన్నారు.
ప్రవేటు పాఠశాలలో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించాల్సి ఉండటంతో ఆ ఫీజులను చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుచున్నారు. పాఠశాల మేనేజ్మెంటు వారు ఫీజులు చెల్లించాలని వత్తిడి చేయడంతో కొందరు విద్యార్థిని విద్యార్థులు ఫీజులు చెల్లించలేక మధ్యలోనే విద్యను నిలుపుదల చేయుచున్నారు.జర్నలిస్టు కుటుంబంలోని ఒకరికి పూర్తి రాయితిని, ఇంకొకరికి 50%, మరొకరి 30% రాయితీని ఇతర జిల్లాలో కల్పించడం జరుగుచున్నది.కావున మన నల్లగొండ జిల్లాలోని జర్నలిస్టు పిల్లలకు 75% ఫీజు రాయితీని కల్పించగలరని అదేవిధంగా వెంటనే తగిన ఉత్తర్వులు జారీ చేయగలరని కోరుచున్నాము. వినతి పత్రం అందజేసిన వాళ్ళు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి, పరమేష్ , సంఘం నాయకులు మాదరి యాదగిరి, ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బోజు మదనాచారి, ఉపాధ్యక్షులు గంగాధర వెంకటేశ్వర్లు, జర్నలిస్టులు వంగాల శ్రీనివాసరెడ్డి ,ఎండి సయ్యద్ , పిట్టల రామకృష్ణ , ఉయ్యాల లింగయ్య డిఎస్ యాదవ్,
దొటి శ్రీనివాస్, సోమచంద్రశేఖర్ , పి అశోక్ కుమార్ ,వుర రమేష్ , ఎస్ రాంప్రసాద్ , టి శంకర్ పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments