చీకటి వెలుగు.నల్లగొండ,
‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్’లో భాగంగా 15–18 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక ఆరోగ్య స్క్రీనింగ్ శిబిరాన్ని నేడు (21.05.2026) పానగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)లో నిర్వహించారు. ఈ కార్యక్రమం 18 మే 2026 నుండి 23 మే 2026 వరకు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ శిబిరంలో రక్తహీనత (Anemia), మధుమేహం BMI పరీక్షలతో పాటు నెలసరి పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే శారీరక, మానసిక, పోషకాహార సంబంధిత సమస్యలపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, బాలికల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. కౌమార దశలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం, నెలసరి పరిశుభ్రత వంటి అంశాలపై ప్రతి బాలికకు అవగాహన అవసరమని తెలిపారు. వైద్యులు ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని సూచించారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీ బి. శరత్ చంద్ర మాట్లాడుతూ, 15–18 సంవత్సరాల వయస్సు గల బాలికలలో హార్మోన్ల మార్పుల కారణంగా శారీరక, మానసిక సమస్యలు సాధారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తోందని, సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు.
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తబస్సుం మాట్లాడుతూ, కౌమార దశలో ఋతుస్రావ సమస్యలు, మొటిమలు, బలహీనత, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు. సరైన పోషకాహారం, పరిశుభ్రత, వైద్య సలహాలు పాటించడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ PACS చైర్మన్ శ్రీ ఆలకుంట్ల నాగరత్నం రాజు కార్పొరేటర్లు శ్రీమతి పేర్ల మల్లేశ్వరి , శ్రీమతి ఆలకుంట్ల ఝాన్సీ మెప్మా టీఎంసీ శ్రీనివాస్ గారు, సి.ఓలు అనిల్ కుమార్, జ్యోతి, రాజా, నరసింహ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆర్‌పీలు పాల్గొన్నారు. మొత్తం 89 మంది కౌమార బాలికలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments