నల్గొండ పట్టణంలోని న్యూస్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఘన విజయాన్ని సాధించారు. ఈ విషయాన్ని పాఠశాల చైర్మన్ గంట్ల అనంతరెడ్డి తెలిపారు.
ఈ ఫలితాల్లో
- ఎస్. వర్షిత్ రెడ్డి 589 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచారు
- ఎన్. లోకేష్ 583 మార్కులు
- ఏ. దీపిక 582 మార్కులు
- కే. సుశాంత్ 579 మార్కులు
- ఆర్. జనారెడ్డి, ఎస్. సాయి తేజస్విని 578 మార్కులు సాధించారు
- ఇతర విద్యార్థులు 576, 574, 573, 571 మార్కులు సాధించి ప్రతిభ చాటారు
మొత్తం 89 మంది విద్యార్థుల్లో 63 మంది 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. అలాగే పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది.
ఈ విజయానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం కారణమని చైర్మన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అడ్మినిస్ట్రేటర్ గంట్ల పద్మ, ప్రిన్సిపల్ అలుగుబెల్లి తిరుమల్ రెడ్డి, అలుగుబెల్లి స్పందనతో పాటు ఫాతిమా, శైలజ, పర్వత్ రెడ్డి, నగేష్, జగన్ రెడ్డి, లక్ష్మణ్, భీష్మ చారి, కార్తీక్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments