ePaper
Wednesday, May 13, 2026

దేవరకొండలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. లైసెన్స్ లేకుండా వ్యాపారం గుర్తింపు

నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి దేవరకొండ బస్టాండ్ ప్రాంగణంలోని శివ గంగా ట్రేడర్స్, తిరునాల రోటరీ ఆయిల్ మిల్ మరియు నందిని సంస్థలను తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే 15 లీటర్ల టిన్ల నుంచి గానుగ యంత్రాల ద్వారా లూజ్ ఆయిల్స్ విక్రయిస్తున్నట్లు బయటపడింది.

ఈ సందర్భంగా మూడు అనుమానిత ఆయిల్ నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు.

వ్యాపార నిర్వాహకులకు నాణ్యమైన వేరుశెనగలు, ముడి పదార్థాలు మాత్రమే వినియోగించాలని, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

అలాగే ప్రజలు లూజ్ ఆయిల్స్ కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం అన్ని ఫుడ్ బిజినెస్ నిర్వాహకులు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ పొందాలని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!