ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరై వివిధ స్టాళ్లను సందర్శించారు.
వారి వెంట వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో పంటల వైవిధ్యీకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతు సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు.
రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments