ePaper
Sunday, June 21, 2026

నల్లగొండ పాతబస్తీ గౌడ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా

చీకటి వెలుగు నల్లగొండ,

నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, నూతన కార్పొరేటర్ల సన్మాన కార్యక్రమం ఆదివారం గౌడ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. సంఘ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గౌడ పెద్ద బైరగోని రాజయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి వార్డులో గౌడ సంఘ కమిటీలను ఏర్పాటు చేసి గౌడ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమాజ అభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మరో గౌడ పెద్ద తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజ గర్వకారణమైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని పట్టణంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో దివంగత కందుల యాదగిరి గౌడ్ స్మారకార్థం ఆయన సతీమణి కందుల నిర్మలమ్మ గౌడ్, కుమారులు బాలరాజు గౌడ్, రమణ గౌడ్లు గౌడ సంఘ భవన నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా గౌడ కార్పొరేటర్లు రేగట్టే అండాలు లింగస్వామి గౌడ్, గోపగోని స్వాతి రాజశేఖర్ గౌడ్, పాలకూరి సుమలత సంతోష్ గౌడ్లను సన్మానించారు. అలాగే స్థానిక కార్పొరేటర్ గుండబోయిన పుష్పలత వెంకన్న యాదవ్, అక్కనపల్లి రేవతి, బలరాం, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
గౌడ పెద్దలు పుల్లెంల యాదగిరి గౌడ్, సురిగి వెంకన్న గౌడ్ హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
నూతన కమిటీలో అధ్యక్షుడిగా పెద్దగోని సురేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా బోయపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. కమిటీ సభ్యులుగా పుల్లెంల రాము గౌడ్, చెన్నగోని లింగస్వామి గౌడ్, బోయపల్లి మధు గౌడ్, కొమ్మగోని సతీష్ గౌడ్, ఐతగోని రమేష్ గౌడ్, వాయుల నాగరాజు గౌడ్, అనంతల యాదగిరి గౌడ్, ఐతగోని గణేష్ గౌడ్ తదితరులు పదవీ బాధ్యతలు చేపట్టారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!