చీకటి వెలుగు – నల్గొండ
రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని, **జాతీయ విద్యా విధానం (NEP-2020)**ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయిస్తూ విద్యాహక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్, రాష్ట్ర యూనివర్సిటీస్ కో-కన్వీనర్ మౌనేష్, హాస్టల్స్ కో-కన్వీనర్ సంపత్, గోపీచంద్, రాష్ట్ర ఫార్మావిజన్ కో-కన్వీనర్ శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, మోహన్, విద్యార్థి నాయకులు కార్తీక్, సతీష్, వరుణ్, లోకేష్, లక్ష్మీనివాస్, చరణ్, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments