చీకటి వెలుగు – నల్గొండ, జూన్ 22:
నల్గొండలోని అధీకృత మారుతి సుజుకి అరేనా డీలర్ పవన్ మోటార్స్ ఆధ్వర్యంలో సరికొత్త ‘మారుతి సుజుకి విక్టోరిస్ – ఎడ్జ్ ఎడిషన్’ SUVని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు.
ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికత, మారుతి సుజుకికి ఉన్న విశ్వసనీయతను మేళవించిన ఈ ఎడ్జ్ ఎడిషన్ SUV విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండకు విక్టోరిస్ ఎడ్జ్ ఎడిషన్ను పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఐదు నక్షత్రాల భద్రతా రేటింగ్ పొందిన ఈ కారు అత్యంత వేగంగా లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుందని, 2026 ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకుందని తెలిపారు.
ఎడ్జ్ ఎడిషన్‌లో బ్లాక్‌డ్-అవుట్ స్టైలింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో కూడిన క్లాడింగ్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్, ఏరో వెంట్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైల్స్, రియర్ స్పాయిలర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయని వివరించారు. భారతీయ రోడ్ల అవసరాలకు అనుగుణంగా మారుతి సుజుకి నిరంతరం వినూత్న వాహనాలను అందిస్తోందని చెప్పారు.
ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు, టెస్ట్ డ్రైవ్‌ల కోసం వినియోగదారులు చెర్లపల్లి, అద్దంకి బైపాస్ రోడ్డులోని పవన్ మోటార్స్‌ను సందర్శించాలని కోరారు. విక్టోరిస్ ఎడ్జ్ ఎడిషన్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేటర్లు జానకి గుమ్మల మోహన్ రెడ్డి, బొజ్జ శంకరయ్య, దొడ్డి రమేష్, పేరిక స్వాతి వినాయక్ రాజ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పవన్ మోటార్స్ సీనియర్ అధికారులు CCO కందల రవి రెడ్డి, జీఎం నాగమణితో పాటు పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments