ePaper
Saturday, May 30, 2026

నల్లగొండలో హిందూ సమ్మేళనం ఘనంగా

నల్లగొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దింటకుర్తి నారాయణ స్వామీజీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి కులం ఉన్నప్పటికీ అందరూ హిందువులుగా కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు.

విశిష్ట అతిథి మేడిపల్లి యాదన్ కుమార్ మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు సమస్యలు వస్తే అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు.

మహిళా వక్త కళ్లెం స్వప్న కుటుంబ విలువలు, సంస్కృతి గురించి పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.

ముఖ్య వక్త అప్పల ప్రసాద్ మాట్లాడుతూ కులాలు గడపలోపల మాత్రమే ఉండాలని, బయట మనమందరం హిందువులుగా ఉండాలని అన్నారు. పిల్లలకు విద్యతో పాటు సంస్కృతి, మాతృభాషపై అవగాహన కల్పించాలని సూచించారు.

సమ్మేళన సమితి అధ్యక్షుడు లకుమారపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాటం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!