ePaper
Saturday, May 30, 2026

ఉద్యోగం చేసే భార్య ఇంటి ఖర్చు భరించాలి.. బాంబే హైకోర్టు కీలక తీర్పు

ఉద్యోగం చేస్తున్న భార్య కూడా కుటుంబ ఖర్చుల బాధ్యతను పంచుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్న సందర్భాల్లో కుటుంబ నిర్వహణ, ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాల విషయంలో పరస్పర బాధ్యత ఉండాలని కోర్టు అభిప్రాయపడింది.

వివాహ బంధం అనేది ఇద్దరి భాగస్వామ్యంతో నడిచే వ్యవస్థ అని, కేవలం భర్తపైనే మొత్తం ఆర్థిక భారం వేయడం సరైనది కాదని పేర్కొంది.

కుటుంబ జీవనంలో సమాన బాధ్యతలు, పరస్పర సహకారం అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు కుటుంబ బాధ్యతలు, దాంపత్య సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!