చీకటి వెలుగు నల్లగొండ.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి నల్లగొండ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు. యూనియన్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో వివిధ మార్గాల్లో సుమారు 3 వేల మంది హైదరాబాద్‌కు బయలుదేరారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా హామీని అమలు చేయలేదని కిరణ్‌కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీని ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఎస్ రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల విజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి శాగంటి రోహిణి, జిల్లా మహిళా కార్యదర్శులు సుచరిత, రేణుక, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భిక్షం, నాయకులు సోమనాథ్, గురిజ మహేష్, హేమంత్, శ్రీనివాస్, సంపత్, శైలజ, జ్యోతి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments