చీకటి వెలుగు నల్లగొండ.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320E 17వ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం నల్గొండలోని ఏచూరి గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ K.V. ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ Dr. బాబూరావు ఘట్టమనేని, ఇన్స్టాలేషన్ ఆఫీసర్‌గా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ నరేంద్ర భండారీ హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి PID లయన్ Dr. బాబూరావు ఘట్టమనేని మాట్లాడుతూ..సమాజంలో పేదరికం, ఆరోగ్య సమస్యలు, విద్యా లోపాలను అధిగమించడానికి లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన క్యాబినెట్ సభ్యులు మానవత్వంతో కూడిన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, సమాజంలో ప్రతి ఒక్కరికీ లయన్స్ సేవలు అందుబాటులోకి రావాలని పిలుపునిచ్చారు.
గౌరవ అతిథులుగా GAT ఏరియా లీడర్ లయన్ A. గోపాల్ రావు అరవింద, LCIF ఏరియా లీడర్ లయన్ దీపక్ భట్టాచార్య, కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ A. అమర్నాథ్ రావు, ఇమ్మీడియట్ పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ లయన్ T. రాజేంద్ర ప్రసాద్, PMCC & GST కోఆర్డినేటర్ లయన్ మోహన్ రావు తీగల, పాస్ట్ GAT ఏరియా లీడర్ & డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్ AGW లయన్ భీమయ్య జగిని పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు లయన్ మదన్ మోహన్ రేపాల, Er. ప్రభాకర్ రెడ్డి యారాల, Ch.V. శివ ప్రసాద్, కోటేశ్వరరావు అమృతపల్లి, మోహన్ రెడ్డి యానాల, కృష్ణారావు దారా, రఘుపతి నేతి, Dr. మురళీకృష్ణ కాపా, మురళీధర్ రావు మోతుకూరి, E.V. రమేష్, Dr. N. బాలయ్య, K.N. ప్రసాద్, Dr. రాఘవ రెడ్డి ఆచవరం, గోపాల్ రెడ్డి పోరెడ్డి, లక్ష్మీనారాయణ వేములపల్లిలతో పాటు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ చైర్పర్సన్ లయన్ Dr. అమరేందర్ రెడ్డి గోలి, కో-చైర్పర్సన్ లయన్ రమేష్ కర్నాటి పాల్గొని మాట్లాడారు.
అనంతరం జిల్లా గవర్నర్ దంపతులను క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమ వ్యాఖ్యాతలుగా లయన్ శైలజ ఏచూరి, లయన్ మురళీధర్ రెడ్డి తుమ్మలూరి, లయన్ సుధారాణి తోకల వ్యవహరించిన ఈ కార్యక్రమంలో GAT టీమ్ సభ్యులు లయన్ శ్యామ్ బాబు ఉండ్రు, లయన్ శివ శంకర్ రావు సింహాద్రి, లయన్ రవీందర్ రావు బాచుపల్లి మరియు కొలాబరేటివ్ GAT టీమ్ సభ్యులు లయన్ ప్రభాకర్ రావు లగడపాటి, లయన్ కమలాకర్ రావు రాచర్ల, లయన్ కరుణాకర్ రెడ్డి అలుగుబెల్లి, లయన్ సంతోష్ కొండ మరియు వివిధ క్యాబినెట్ ఆఫీసర్లు, రీజియన్ చైర్మన్లు, జోన్ చైర్మన్లు, వివిధ క్లబ్ ల ప్రెసిడెంట్లు, సెక్రెటరీలు, ఆర్థిక కార్యదర్శులు మరియు ఇతర సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments