చీకటి వెలుగు నల్లగొండ.
నల్గొండ పట్టణ శివారులోని హ్యాపీ హోమ్స్ లో గురు వారం మహిళలు గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు. తొలుత కాలనీకి చెందిన మహిళలందరూ సామూహికంగా చెట్ల నుండి గోరింటాకును తీసుకువచ్చి, గౌరీ దేవి ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గౌరీ పూజ అనంతరం సంప్రదాయబద్ధంగా గోరింటాకు నూరి, చేతులపై రకరకాల డిజైన్లలో పెట్టు కున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. ఏ శుభకార్యం జరిగినా గోరింటాకు ను పెట్టుకోకుండా మహిళలు శుభకార్యాలు మొదలు పెట్టరని అన్నారు.గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని, గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉండి గోరింటాకు పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు మానసికంగా ఎంతో ఊరట కలుగుతుందని చెప్పారు. ఆషాడ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని, అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పద్మానాయక్, సుజాత, వసుందర, సరిత, పద్మ, శ్రీలత,, జ్యోతి, సీత, మంగ, రమ, శ్రీలత, శారద, సునంద, మంజుల, అరుణ, నాగమణి, మేఘన, అనూష, రుక్మిణి,శ్వేత, మల్లి,వరలక్ష్మి, వాణి, భవాని, ఇందిరా, కరుణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments