బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ .

చీకటి వెలుగు నల్లగొండ.బీసీ విద్యార్థి సంఘం బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని నల్లగొండ జిల్లా కేంద్రంలో కళాశాలన్నీ బహిష్కరించి ర్యాలీ నిర్వహించి రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది చేసి తర్వాత విలేకరులతో బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో కళాశాలన్నీ బహిష్కరించి ర్యాలీ నిర్వహించి రాస్తారోకో కార్యక్రమం చేయడం జరిగింది
బీసీ విద్యార్థి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థులకు రావాల్సినటువంటి న్యాయమైన ఫీజు రియంబర్స్మెంట్ ని స్కాలర్షిప్లని తక్షణమే విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులని తీర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలని విడుదల చేయాలి అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల కళాశాలలకు పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించాలి ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 8 ,9 విడుదల చేసిందో దాన్ని రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి చట్టం చేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.ఇంజనీరింగ్/ఫార్మసీ/పీజీ/డిగ్రీ తదితర కోర్సులు పూర్తయిన వారికి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఏ కాలేజికి వెళ్ళి చూసిన విద్యార్ధులు ఫీజులు కట్టలేక నరకయాతన అనుభవిస్తుంటే ప్రభుత్వం సంతోషంగా యుందా అని తక్షణమే బకాయిలు చెల్లించాలని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కోర్సులు పూర్తయిన వారికి ఐటి కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. విదేశాలలో ఉన్నత విద్యా చదువుతున్నారు. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయి కానీ సర్టిఫికెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఫీజుల బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. రోజుకు ఒక జీవో జారీ చేసి విద్యార్థులలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాలని లేకపోతే జులైలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని పిలుపునిచ్చారు.
అలాగే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో బీసీ / ఈబీసీ/ ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని, గత 18 సంవత్సరాల నుంచి ఇస్తున్న విధంగా విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని తెలిపారు.
ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ విధానం పై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చొరవ తీసుకొని గత 18 సంవత్సరాలుగా కొనసాగుతున్న విధానాన్ని అమలు చేయాలని కోరారు.
ఇటీవల ప్రభుత్వం తెచ్చేనా జీవో నెంబర్ 8 – 9 లతో స్పష్టత లేకపోవడం వలన తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. ఫీజులు విద్యార్థుల ఖాతాలోకి వేస్తామని పేర్కొనడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టమని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పైగా ప్రభుత్వం ఫీజులు విద్యార్థులు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ క్రింద అరెస్టు చేస్తామని భయపెట్టడంతో విద్యార్థులలో భయందోళనలు – చదువు పట్ల అనాసక్తి ఏర్పడుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం మరో 10 వేల కోట్లు అప్పు తెస్తే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు.
న్యాయమైన ఈ సమస్యపై ప్రభుత్వం తాత్సారం చేస్తే భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. వారంలో ఐదు లక్షల మంది విద్యార్ధులతో హైదరాబాద్ నిర్బంధం చేస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి,రజక అభివృద్ధి సంస్థ ,విద్యార్థి సంఘం నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్ , బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రాజు యాదవ్, పొగాకు రవికుమార్ యాదవ్ ,మల్లబోయిన తరుణ్ కుమార్ యాదవ్ ,యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనంత నాగరాజు గౌడ్ , యువజన సంఘం జిల్లా కార్యదర్శి గడగోజు విజయాచారి విద్యార్థి సంఘం నాయకులు నాగేష్ ,హరిప్రసాద్ ,కృష్ణ ,మహేష్ ,శివ ,మధు ,మల్లేష్ నరేష్ పృథ్వీరాజ్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments