చీకటి వెలుగు నల్గొండ.
దీనా విజ్ఞాన మందిర్ పాఠశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 1976–2026 స్వర్ణోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని మన్యంచెల్క ప్రాంతంలో విద్యా సేవలు అందిస్తున్న ఈ విద్యాసంస్థ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
ఈ నెల 19న ఆదివారం నల్లగొండలోని ఎం.ఏ. బైగ్ ఫంక్షన్ హాల్, బీటీఎస్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయం వద్ద వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
దీనా విజ్ఞాన మందిర్ పాఠశాల వ్యవస్థాపకురాలు, పదవీ విరమణ పొందిన జిల్లా విద్యాశాఖ అధికారి దివంగత శ్రీమతి దీనా రాణి అందించిన విశిష్ట విద్యా సేవలను స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
1976 నుంచి ఇప్పటివరకు పాఠశాలలో సేవలందించిన ఉపాధ్యాయులందరినీ ఈ సందర్భంగా గౌరవ అతిథులుగా ఆహ్వానించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి సంహితా రాణి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
స్వర్ణోత్సవ వేడుకలకు పూర్వ విద్యార్థులంతా కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాఠశాల యాజమాన్యం కోరింది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన వసతి కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
దీనా విజ్ఞాన మందిర్ పూర్వ విద్యార్థులందరికీ ఈ స్వర్ణోత్సవ వేడుకలకు ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments