ePaper
Wednesday, July 22, 2026

అధికార దాహంతో చెన్నుగూడెం సర్పంచ్ ఆగడాలు..!

70 ఏళ్లుగా కబ్జా లో ఉన్న 20 గుంటల భూమిపై కన్నేసిన వైనం

భూమిలో ఉన్న నిర్మాణాలపై జెసిబి సహాయంతో ధ్వంసం..!

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదంటున్న బాధితులు

చీకటి వెలుగునల్లగొండ,

నల్లగొండ మండలంలోని చెన్నుగూడెం గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు బుధవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు 70 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమిలోకి సర్పంచ్ మర్రి సతీష్ , ఆయన వర్గీయులు అక్రమంగా చొరబడి జేసీబీల సహాయంతో భూమిలో ఉన్న బండరాలను తొలగించడంతోపాటు భూమిని చదును చేశారు.అక్కడ ఉన్న నిర్మాణాలను సైతం ధ్వంసం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమపై దాడులకు యత్నించారని, నిర్మాణాలు కూల్చివేస్తున్న సమయంలో 100 నంబర్‌కు ఫోన్ చేసినప్పటికీ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చిఎలాంటి చర్యలు తీసుకోకుండా వెనుదిరిగారని వారు వాపోయారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ చర్యలు కొనసాగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ భూమిపై సివిల్ కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ ఇలా అక్రమంగా అధికార పార్టీ అండదండలతో దౌర్జన్యంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం తో సుమారు 150 ఎకరాలు భూమిని సేద్యం చేయానీయకుండా చేశారని తెలిపారు.
న్యాయం కోసం పలుమార్లు పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని, తమ ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, రూరల్ ఎస్‌ఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బాధితులు మర్రి లింగయ్య, చంద్రయ్య, రాములు, యాదయ్య, ఐలయ్య, సైదులు, నరసింహ, శేఖర్, నరేష్ లు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!