చీకటి వెలుగు నల్గొండ.

ఆషాఢ మాసం బుధవారం (జూలై 15) నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతుందని, ఆగస్టు 13 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతుందని కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచార్య తెలిపారు. ఆషాఢ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని, ఈ నెలలో అమ్మవారు, పరమశివుడు, శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు.ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) జూలై 25న వస్తుందని, అదే రోజున దేవశయని ఏకాదశితో చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. బుధవారం నుంచే గుప్త వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ నెలలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం, పూజలు, వ్రతాలు, దానధర్మాలు, దేవాలయ దర్శనాలు చేయడం ఎంతో శుభప్రదమన్నారు.శ్రావణమాసం ప్రారంభమైన తర్వాత వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. నవంబర్ 21న ఉత్థాన ఏకాదశితో చాతుర్మాస దీక్ష ముగుస్తుందని పేర్కొన్నారు. ఆషాఢ, శ్రావణ మాసాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి దైవానుగ్రహం పొందాలని నాగోజు మల్లాచార్య సూచించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments