ePaper
Friday, September 4, 2026

వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన… అధికారులకు తక్షణ చర్యల కోరిన 10వ డివిజన్ కార్పొరేటర్

నల్లగొండ పట్టణంలోని 10వ డివిజన్ పరిధిలో ఉన్న ఐఎంఎస్ హైస్కూల్ పరిసరాలు, సూర్యవంశం కాలనీ, మహాలక్ష్మి అపార్ట్‌మెంట్ ప్రాంతం, నీలగిరి కాలనీ, కనకదుర్గ కాలనీ తదితర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, బురదమయమైన వీధులు, నీటి నిల్వలను 10వ డివిజన్ కార్పొరేటర్ స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న కార్పొరేటర్, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ పనులను అత్యవసరంగా చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత ఉన్నతాధికారులను కోరారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారమే మా తొలి ప్రాధాన్యత. ప్రజల సమస్యలే మా బాధ్యతఅభివృద్ధే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో చినాల ఆంజనేయులు, చెనగోని నాగేష్, పెద్దగోని వెంకన్న, జానకి రాంరెడ్డి, తన్నీరు పూర్ణ, నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!