ePaper
Friday, June 26, 2026

డాక్టర్ అరవింద్ రెడ్డికి బీజేపీ నల్గొండ జిల్లా ప్రొఫెషనల్ సెల్ కన్వీనర్‌గా నియామకం

నల్గొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ అరవింద్ రెడ్డి గారు వైద్య వృత్తిలో ఎన్నో సంవత్సరాలుగా పేద మరియు నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ సమాజ సేవలో విశేష కృషి చేస్తున్నారు.

అలాగే గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకత్వం, సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ప్రొఫెషనల్ సెల్ విభాగం రాష్ట్ర జిల్లా కన్వీనర్‌గా నియమించింది.

ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ గారు మరియు జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు మరియు జిల్లా ఇంచార్జ్ ప్రతాప్ గారి చేతుల మీదుగా డాక్టర్ అరవింద్ రెడ్డికి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.

భవిష్యత్తులో డాక్టర్ అరవింద్ రెడ్డి గారు తన సేవలను మరింత విస్తరించి, నల్గొండ పట్టణంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పార్టీ నాయకులు మరియు శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు లభించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!