జూన్ 21న నిర్వహించనున్న రీ-నీట్ యూజీ-2026 పరీక్షకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) 15 నిమిషాల అదనపు సమయాన్ని ప్రకటించింది.
ఇప్పటివరకు 180 నిమిషాలుగా ఉన్న పరీక్ష వ్యవధిని 195 నిమిషాలకు పెంచారు. దీంతో పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగనుంది.
హాజరు పత్రాలపై సంతకాలు, పర్యవేక్షణకు సంబంధించిన ఇతర తప్పనిసరి ప్రక్రియల కోసం ఈ అదనపు సమయాన్ని కేటాయించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.
విద్యార్థుల నుంచి గత కొన్నేళ్లుగా వచ్చిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు తెలిపింది.
రీ-నీట్ పరీక్షను నిష్పక్షపాతంగా, భద్రంగా, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments