ePaper
Friday, September 4, 2026

జర్నలిస్టులకు తీపికబురు.. బస్‌పాస్‌ల జారీకి గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో గుర్తింపు పొందిన వర్కింగ్ జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. 2026-2028 సంవత్సరాలకు గాను రాయితీపై అందించే టీజీఎస్ఆర్టీసీ బస్‌పాస్‌ల జారీకి మార్గం సుగమమైంది.

ఈ మేరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించేలా టీజీఎస్ఆర్టీసీ వెబ్‌పోర్టల్‌లో తక్షణమే సదుపాయం కల్పించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారికంగా లేఖ రాశారు.

జూన్ 17, 2026 నుంచి ఏప్రిల్ 30, 2028 వరకు చెల్లుబాటు అయ్యే ఈ బస్‌పాస్‌ల కోసం అర్హులైన జర్నలిస్టులు త్వరలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

ఇప్పటికే కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుండగా, బస్‌పాస్‌ల దరఖాస్తులకు కూడా అనుమతి లభించడంతో పాత్రికేయ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!