నల్లగొండ, మే 26 :
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ హాల్లో నిర్వహించారు. సమావేశంలో బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో ఉన్న విద్యుత్, మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
సమావేశంలో మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments