ePaper
Friday, May 15, 2026

రియల్ ఎస్టేట్ రంగంతోనే నల్లగొండ నగరాభివృద్ధి : కార్పొరేటర్లు

చీకటి వెలుగు-నల్గొండ ప్రతినిధి:

నల్లగొండ నగరం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు పిల్లి కృష్ణంరాజు, దీపలా నాయక్, దీపికా ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం పట్టణంలోని సాగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన “నల్లగొండ రియల్ ఎస్టేట్” కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగమే ముఖ్య సూచిక అని తెలిపారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే రియల్ రంగం బలోపేతం కావాల్సిందేనన్నారు.

వ్యాపారాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పడాలంటే భూములు అవసరమని, భూములు మరియు ప్లాట్ల కొనుగోలు–అమ్మకాల ద్వారా మున్సిపాలిటీతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఆ ఆదాయం అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుకు దోహదపడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ కార్యాలయ యాజమాన్యం గొపగాని రాజశేఖర్, కారింగు నరేష్, నకిరేకంటి సైదులు, బైరు వెంకన్న, పనస చందు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!