ePaper
Friday, May 15, 2026

నల్గొండ జనరల్ ఆసుపత్రిలో నర్సుల దినోత్సవ వేడుకలు

నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు

నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ, నర్సింగ్ అధికారులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సులు అందించే సేవలు ఎంతో గొప్పవని, ప్రాణాలను కాపాడడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలకు గుర్తుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు.

నేటి తరం నర్సులు ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు సేవలు అందించాలని కోరారు. నర్సింగ్ సేవలు లేకుండా ఏ ఆసుపత్రి కూడా సమర్థవంతంగా నడవదని పేర్కొన్నారు.

ప్రభుత్వం నర్సుల సేవలను గుర్తించి నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తింపు కల్పించిందని, వివిధ విభాగాల్లో వారి సేవలను బలోపేతం చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఆర్‌ఎంఓ చంద్రశేఖర్, నర్సింగ్ సూపరింటెండెంట్లు నీలాబాయి, సుజాత, రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!