హనుమాన్ జయంతి సందర్భంగా మారుతి మందిర్‌లో ఘనంగా అభిషేకాలు
హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండ ముషంపల్లి రోడ్డులోని మారుతి మందిర్‌లో అశేష భక్తులు పాల్గొని హనుమాన్ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయ కమిటీ పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా కీర్తనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, హనుమాన్ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
మారుతి మందిరం ఆలయ కమిటీ తరఫున నల్గొండ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కంచర్ల భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మంత్రవాది శ్రవణ్ కుమార్, కోశాధికారి నామాల నరసింహ, కార్యనిర్వాహక సభ్యులు నామాల నీరజ, నేతాపురం వెంకటేశ్వర్లు, వట్టికోట కృష్ణయ్య, నామాల లక్ష్మీనారాయణ, మీరా తదితరులు మరియు భక్తులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments