ePaper
Monday, March 2, 2026

నర్సంపేటలో హరిత పోలింగ్ కేంద్రం.. కలెక్టర్ సత్య శారద పరిశీలన

నర్సంపేట, ఫిబ్రవరి:

నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. ఓటర్లకు అందిస్తున్న సౌకర్యాలు, పారిశుధ్య ఏర్పాట్లు, గ్రీన్ థీమ్ అలంకరణలను ఆమె సమీక్షించారు.

ఈ సందర్భంగా యువ ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగుతూ సందడి చేశారు. పర్యావరణ హితంగా అలంకరించిన పోలింగ్ కేంద్రం అందరి దృష్టిని ఆకర్షించింది.

కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా హరిత పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!