ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ పరిధిలోని గంధవారిగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక కార్పొరేటర్ బాణావతి దీప్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, ఇందిరా మహిళా శక్తి పథకం కింద అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహిళల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రదీప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments