ePaper
Monday, March 2, 2026

2028 మేడారం జాతరపై ముందస్తు ప్రణాళికలు.. అధికారులకు సీఎం కార్యదర్శి ఆదేశాలు

మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఏర్పాట్లలో భాగంగా VVIP వాహనాలు వచ్చే రహదారుల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ మినిస్టర్ కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాసరాజు ఐఏఎస్ గురువారం ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలంలో జాతరకు సంబంధించిన కీలక ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా VVIP వాహనాల రాకపోకలకు ఉపయోగించే రహదారి, వాహనాల పార్కింగ్ స్థలం, మేడారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో మాట్లాడిన సీఎం కార్యదర్శి, జాతర సమయంలో VVIP వాహనాల మార్గంలో ఎదురయ్యే సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2026 మహాజాతరలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, 2028 జాతరలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

రాబోయే జాతరలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. అలాగే జాతర విజయవంతానికి కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు సహా పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!