ePaper
Monday, March 2, 2026

ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ.. భక్తులతో కిటకిట

ఇవాళ (ఫిబ్రవరి 4) మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల జాతరలో అత్యంత ప్రాధాన్యత కలిగిన తిరుగువారం పండుగ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు మేడారానికి తరలివచ్చారు.

తిరుగువారం రోజున అమ్మవార్లను దర్శించుకోవడం ఎంతో శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. గద్దెల వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలు సజావుగా సాగేందుకు స్వచ్ఛంద సేవకులు, పోలీస్ సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. భక్తులు నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!