చీకటి వెలుగు నల్లగొండ.

పట్టణంలోని 22వ డివిజన్ శ్రీనివాస ప్రియదర్శిని కాలనీలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తులు, పోతురాజు వేషధారణలు, డప్పు చప్పుళ్లతో కాలనీలో పండుగ సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మేడి అరుణ, జానయ్య స్వామి, ఊట్కూరు సోనీ, మేడి నాగరాజు, దర్శన్ మల్లేష్, మాతంగి సైదులు, వంగూరి యాదయ్య, అద్దంకి యాదగిరి, కాసమల్ల శీను, అద్దంకి ప్రతాప్, గాజుల స్వామి, బోగరి లక్ష్మమ్మ, అశ్విని, మంజుల, పసుపులేటి ఉమా తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments