TVAE JAC రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొనసాగుతున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. ప్రభుత్వం, యాజమాన్యం కార్మికుల సమస్యలపై స్పందించకుండా, టెర్మినేషన్ బెదిరింపులకు దిగుతున్న మొండి వైఖరిని కార్మికులు తీవ్రంగా ఖండించారు.
ఈ నేపథ్యంలో కార్మికులు భయపడకుండా పెద్ద సంఖ్యలో పాల్గొని 9వ రోజు దీక్షను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, 8వ రోజు జరిగిన చర్చలు విఫలమవడంతో మనస్థాపానికి గురైన గోడ కొమ్మలు అనే కార్మికుడు గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు.
ఈ రోజు నిరసనలో భాగంగా 12 మంది కార్మికులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జిట్టబోయిన లింగస్వామి, జిల్లా నాయకులు, మహిళా కార్మికులు సహా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments