చీకటి వెలుగు నల్లగొండ.
నల్లగొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో అప్రెంటిస్‌శిప్–ఉద్యోగ మేళా ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రధానాచార్యులు శ్రీ ఎ. ఉపేందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నల్లగొండ జిల్లా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ ఆర్. దస్రు నాయక్ మాట్లాడుతూ, విద్యార్థులు త్వరగా ఉద్యోగ రంగంలో అడుగుపెట్టాలంటే అప్రెంటిస్‌శిప్ పూర్తి చేయడం ఎంతో అవసరమని తెలిపారు. ఇందుకు ఇటువంటి ఉద్యోగ మేళాలు మంచి వేదికగా నిలుస్తాయని, విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇంటర్మీడియట్ విద్యామండలి ఉద్యోగ మేళాల సమన్వయకర్త శ్రీ నండూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, నల్లగొండలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల్లో వృత్తి విద్య పూర్తి చేసిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉపాధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి. సులోచన రాణి, యాదాద్రి భువనగిరి జిల్లా నోడల్ అధికారి డి. సురేష్ రెడ్డి, వివిధ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు హాజరయ్యారు.
మేళాలో 25 సంస్థలకు చెందిన ప్రతినిధులు, అధికారులు పాల్గొని సుమారు 500 మంది విద్యార్థులకు ముఖాముఖి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 340 మంది విద్యార్థులు ఎంపికై ఉద్యోగ అవకాశాలు పొందారు. కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ వృత్తి విద్య జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments