ePaper
Wednesday, July 22, 2026

మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి చేతుల మీదుగా బజరంగ్ సానిటరీ & ఎలక్ట్రికల్స్ ప్రారంభం

చీకటి వెలుగు నల్లగొండ,

నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బజరంగ్ సానిటరీ & ఎలక్ట్రికల్స్ షోరూమ్‌ను నగర మేయర్ శ్రీ బుర్రి చైతన్య శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ కొబ్బరికాయ కొట్టి, అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన సానిటరీ వస్తువులు, ఎలక్ట్రికల్ సామగ్రి, పెయింట్స్ ఉత్పత్తులను అందిస్తూ విశ్వసనీయమైన సేవలతో వ్యాపార రంగంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభించిన సంస్థ ప్రజల ఆదరణ పొందుతూ మరింత అభివృద్ధి చెందాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ అమీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రు శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కార్పొరేటర్స్ పిల్లి కృష్ణమరాజు, రమ్యశ్రీ రాఖి, హాజరయ్యారు. అలాగే స్థానిక కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కస్టమర్లు పాల్గొని నూతన సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు. బజరంగ్ సానిటరీ & ఎలక్ట్రికల్స్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!