భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయానికి ప్రత్యేక రైల్వే లైన్, రైల్వే స్టేషన్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. ఈ నెల 26న రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకుడు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి రామరాజు యాదవ్ కేంద్ర మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి గొంగడి కప్పి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, ఈ నెల 26న జరగనున్న కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నల్లగొండ నియోజకవర్గంలోని భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కొమురవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఈ రైల్వే స్టేషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments