నల్లగొండలో ఎన్నికలు.. అభివృద్ధికి కృషి చేస్తామన్న నూతన కార్యవర్గం
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మేరు కుల సంఘం సమావేశంలో జిల్లా, నగర కమిటీల ఎన్నికలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా బోనగిరి సురేందర్ మేరు, ప్రధాన కార్యదర్శిగా గుంటి రామకృష్ణ మేరు ఎన్నికయ్యారు. నగర అధ్యక్షుడిగా రాంప్రసాద్ మేరు, ప్రధాన కార్యదర్శిగా శారపర్తి వెంకటేశ్ మేరు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ మేరు కులస్తుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. బీసీ-డి నుంచి బీసీ-ఏ విభాగంలోకి మార్పు, 50 సంవత్సరాలుగా కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్తులకు పింఛన్లు, సమగ్ర ఆరోగ్య బీమా, ప్రత్యేక ఆరోగ్య కార్డుల సాధనకు ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
మేరు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు, కులస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
ఎన్నికల కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల స్థాయి నుంచి తరలివచ్చిన మేరు బంధువులకు నూతన కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments