చీకటి వెలుగునల్లగొండ,
చర్మంపై వచ్చే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన వైద్య చికిత్స తీసుకోవడం ద్వారా అనేక చర్మవ్యాధులను నియంత్రించవచ్చని చర్మవ్యాధుల నిపుణురాలు డాక్టర్ భవ్య బాలిన అన్నారు. మొటిమలు (యాక్నే), మచ్చలు, అలర్జీలు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, సోరియాసిస్, ఎగ్జిమా, జుట్టు రాలడం, కుష్ఠువ్యాధి తదితర చర్మ సంబంధిత సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ నాటరాజ్ థియేటర్ సమీపంలో ‘స్కంద ఎలైట్ స్కిన్ క్లినిక్’ను సోమవారం ప్రారంభించారు. ‘ఈరోజు సంరక్షణ.. ఎప్పటికీ కాంతివంతమైన చర్మం’ అనే నినాదంతో క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ కోతనసు సోంబాబు, డాక్టర్ భవ్య బాలిన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ భవ్య బాలిన మాట్లాడుతూ.. చర్మాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమస్యలు కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. స్వయంగా మందులు వాడటం, స్టెరాయిడ్ క్రీములను వైద్యుల సలహా లేకుండా వినియోగించడం వల్ల చర్మానికి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. చర్మ సంరక్షణతో పాటు జుట్టు, గోళ్లకు సంబంధించిన సమస్యలకు కూడా నిపుణుల సలహాతో తగిన చికిత్స పొందాలని పేర్కొన్నారు. డాక్టర్ భవ్య బాలిన గాంధీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్, ఎన్‌ఆర్‌ఐఏఎస్ నుంచి చర్మవ్యాధులు, లైంగిక వ్యాధులు, కుష్ఠువ్యాధి విభాగంలో ఎండీ పూర్తి చేశారు. ప్రపంచ చర్మవ్యాధుల సహకార సంస్థకు చెందిన ఏఏఎఫ్‌పీ అర్హతతో పాటు తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి నమోదు పొందారు. నల్లగొండ పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన చర్మవ్యాధుల వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా. కోతనసు సోంబాబు, డా. రాధ మాలికా దేవి, బంధువులు, ప్రజలు, ఆసుపత్రి సిబ్బంది, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments