ePaper
Friday, September 4, 2026

కొండమల్లెపల్లి క్రషర్ మిల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి క్రషర్ మిల్ సమీపంలోని గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది.

మృతదేహం వద్ద ఇంజెక్షన్ సూది, కాలిపోయిన దుస్తులు కనిపించినట్లు సమాచారం. దీంతో మృతుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి మృతదేహానికి నిప్పంటించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్రషర్ మిల్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!