చీకటి వెలుగు నల్లగొండ.
నల్గొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి సహాయకులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా జనార్దన్‌గౌడ్ మాట్లాడుతూ కంచర్ల భూపాల్‌రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్ల జీవితం ప్రసాదించాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, నల్గొండ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న కంచర్ల భూపాల్‌రెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దణ్ణంపల్లి సత్తయ్యగౌడ్, భారత రాష్ట్ర సమితి యువజన నాయకులు కారింగ్ నరేష్‌గౌడ్, అనంత నాగరాజుగౌడ్, అంబటి శివకుమార్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కొంపెల్లి రామన్నగౌడ్, సత్యనారాయణగౌడ్, నాగరాజు, పృద్వి, మహేష్, నరసింహ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments