చీకటి వెలుగునల్లగొండ,
నల్లగొండ పట్టణ కేంద్రంలో బీపీ మండల్ 109వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిరియాల యాదగిరి, కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం విశేష కృషి చేసిన నాయకుడు బీపీ మండల్ అని కొనియాడారు. బిహార్ ముఖ్యమంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా సేవలందించిన మండల్.. వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం 42 సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని పేర్కొన్నారు.
మండల్ కమిషన్ చేసిన మిగతా సిఫారసులను కూడా అమలు చేయించే వరకు బహుజనులంతా ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు పిలుపునిచ్చారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బక్కతట్ల వెంకన్న యాదవ్, పట్టణ అధ్యక్షులు పుట్టా వెంకన్న గౌడ్, ముప్పిడి మల్లికార్జున్ యాదవ్, గజ్జి అజయ్‌కుమార్, సుంకరబోయిన శివ యాదవ్, మల్లబోయిన సతీష్ యాదవ్, పున్న వీరేశం, లకటాపురం వెంకన్న, నారబోయిన వేణు యాదవ్, గొట్టే సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments