చీకటి వెలుగు నల్గొండ,
చిన్నసూరారంలో అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నల్గొండ, తిప్పర్తి మండలాల్లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నల్గొండ మండలం చిన్నసూరారం హామ్లెట్ గ్రామం పావురాలగూడెంలో రూ.1.35 కోట్ల వ్యయంతో నిర్మించిన పీడబ్ల్యూడీ సీసీ రహదారిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడిన మంత్రి, మహిళలు పొదుపుతో పాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన సాధికారత సాధిస్తారని అన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పాటుగా చిన్నసూరారంలో వేర్‌హౌసింగ్ గోదాం లేదా రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి (డీఆర్‌డీఓ) సూచించారు. పావురాలగూడెంలో చౌకధర దుకాణం లేకపోవడంతో గ్రామస్థులు చిన్నసూరారం వరకు వెళ్లి రేషన్ తీసుకురావాల్సి వస్తోందని తెలుసుకున్న మంత్రి, గ్రామంలోనే వెంటనే చౌకధర దుకాణాన్ని మంజూరు చేసి డీలర్‌ను నియమించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి, ఆర్‌డీఓ వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ పి. మోహన్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ధనలక్ష్మి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments