హైదరాబాద్, జూలై 29 (చీకటి వెలుగు): హైదరాబాద్‌లోని ఏ.వి. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో “ఆహార లేబుళ్లు, ఆహార భద్రత, సుస్థిరత” అంశంపై అంతరశాఖ అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు, ఆహార ఉత్పత్తులపై ముద్రించిన లేబుళ్లను సరిగా చదివే విధానం, ఆహార భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యత, ఆహార వ్యర్థాలను తగ్గించే మార్గాలు, సుస్థిర జీవన విధానాలపై అవగాహన కల్పించారు.
సదస్సులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని చర్చల్లో భాగస్వాములయ్యారు. సరైన ఆహార అవగాహన వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా సమాజ శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో కీలకమని వక్తలు వివరించారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఏ.వి. కాలేజ్ యాజమాన్యానికి, అధ్యాపకులు శ్రీ మహేష్ రేఖాల, శ్రీమతి శ్రీలక్ష్మి, ఇతర అధ్యాపకులకు, విద్యార్థులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి అవగాహన కార్యక్రమాలు యువతలో బాధ్యతాయుతమైన, సమాచారంతో కూడిన, సుస్థిర వినియోగదారులుగా ఎదగడానికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments