చీకటి వెలుగు నల్లగొండ.
గంధంవారిగూడెంలోని ఆశ్రమంలో ఓంకార స్వరూపిణి శ్రీశ్రీశ్రీ జగద్గురు బాలయోగిని మాణిక్యేశ్వరి మాత జన్మదిన వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, నల్లగొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆశ్రమ ప్రధాన కార్యదర్శి దేశ గంగాధర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాతగారి దివ్య పాదుకలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. దత్తాత్రేయ స్వరూపిణిగా భక్తులు ఆరాధించే శ్రీశ్రీశ్రీ జగద్గురు బాలయోగిని మాణిక్యేశ్వరి మాత జీవితం, తపస్సు, ఆధ్యాత్మిక సేవలు భక్తులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాకర్ రావు, జగ్జీవన్ రెడ్డి, నాగిరెడ్డి, విశాల్, వెంకట్ రాములు, రాజు, విద్యాసాగర్, కంది సూర్యనారాయణ, గోవర్ధన్, చింత ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా దేశ గంగాధర్ స్వామి మాట్లాడుతూ, మాణిక్యేశ్వరి మాత దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని, భక్తులకు ఆధ్యాత్మిక మార్గంలో శాంతి, సద్బుద్ధి కలగాలని ఆకాంక్షించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments