ePaper
Thursday, July 30, 2026

సాయిబాబా దేవాలయంలో ఘనంగాగురుపౌర్ణిమ వేడుకలు

చీకటి వెలుగు నల్లగొండ.

నల్లగొండ పట్టణంలో గురుపౌర్ణిమ సందర్భంగా ముషంపల్లి రోడ్డులోని సాయిబాబా దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, గురువుల ఆశీస్సులు సమాజ అభ్యున్నతికి మార్గదర్శకమని పేర్కొన్నారు. అనంతరం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దంపతులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మందుల కార్యవర్గ కమిటీ వైస్ చైర్మన్ గొర్రె సుదర్శన్ రెడ్డి, కార్యనిర్వహణ అధ్యక్షులు సిరిగిరి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి కోటిరెడ్డి, సంయుక్త కార్యదర్శి నాగేశ్వరరావు, పరమేశం, రాములు, నిర్వహణ కార్యదర్శి చందా జగదీశ్వర్, కోశాధికారి బుర్రి వెంకటరెడ్డి, న్యాయ సలహాదారులు కట్ట దశరథ రెడ్డి, కార్పొరేటర్ భవాని గణేష్ ,తదితరులు పాల్గొన్నారు. వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన గురుపౌర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!