ePaper
Wednesday, July 22, 2026

నల్లగొండ జిల్లాలో పలువురు సివిల్ ఎస్‌ఐల బదిలీలు

నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పలువురు సివిల్ ఎస్‌ఐలను పరిపాలనా కారణాలు, ప్రజాహితం దృష్ట్యా తక్షణ ప్రభావంతో బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీల వివరాలు:

  • మునుగోడు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఈ. రవిను తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు.
  • తిప్పర్తి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వి. శంకర్ను వీఆర్, నల్లగొండకు అటాచ్ చేశారు.
  • యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం. శోభన్ బాబును మునుగోడు పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు.
  • డీసీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న పి. సురేష్ యాదవ్ను మడ్గులపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు.
  • మడ్గులపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎస్. కృష్ణయ్యను వీఆర్, నల్లగొండకు అటాచ్ చేశారు.

పరిపాలనా కారణాలు, ప్రజాహితం దృష్ట్యా ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!