నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 01, 07, 08, 09, 10, 11 వార్డులకు చెందిన మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద చీరలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణంలో 8 వేల మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల వారి ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సహాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం ద్వారా పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
నకిరేకల్‌లో 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి, ట్రామా కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కడపర్తి గ్రామంలో రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments