ePaper
Wednesday, July 22, 2026

ఉప్పల్, చిలుకానగర్ డివిజన్‌లకు ఐటీ కన్వీనర్‌గా తిరుమల మహేష్ నియామకం

ఉప్పల్/చీకటి వెలుగు న్యూస్:

భారతీయ జనతా పార్టీ ఉప్పల్ అసెంబ్లీ పరిధిలోని ఉప్పల్ డివిజన్ మరియు చిలుకానగర్ డివిజన్లకు ఐటీ కన్వీనర్‌గా నల్గొండకు చెందిన తిరుమల మహేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఇదే సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం (15-07-2026) చిలుకానగర్ డివిజన్ శక్తి కేంద్రం పరిధిలోని ఐదు బూత్‌లలో జరుగుతున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా బూత్ నెంబర్లు 360 (అటవీ శాఖ కార్యాలయ భవనం, బీరప్పగడ్డ, ఉప్పల్), 368, 369 (ఎస్‌ఈ కార్యాలయం, ఆర్.ఆర్. జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్, ప్రశాంత్ నగర్, ఉప్పల్), 405, 406 (దేవేంద్రనగర్ కమ్యూనిటీ హాల్)లకు చెందిన బూత్ స్థాయి అధికారులను (బీఎల్‌వోలు) కలిసి ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన నిర్వహించి, సంబంధిత వివరాలను సేకరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ చిలుకానగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు పద్మ, టీ. కొండల్, తిరుమల మహేష్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!