చీకటి వెలుగునల్లగొండ, ..

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రూబీ స్కాన్ సెంటర్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్కాన్ సెంటర్‌ను ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ గౌరవ అతిథిగా పాల్గొనగా, శ్రీమతి వంగూరి నవ్యశ్రీ రాఖీ ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరయ్యారు.
డా. శ్రీకాంత్ పెరిక (ఎం.బి.బి.ఎస్., డి.ఎన్.బి.–రేడియో డయాగ్నోసిస్) ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలు, నాణ్యమైన నిర్ధారణ సేవలతో ఈ స్కాన్ సెంటర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నల్లగొండ ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షించారు. నామమాత్రపు రుసుములతో నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించి ప్రజల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. వైద్య రంగంలో ఈ కేంద్రం విశ్వసనీయ సేవలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందాలని ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
డా. శ్రీకాంత్ పెరిక మాట్లాడుతూ, గత పదేళ్లుగా న్యూఢిల్లీలో రేడియో డయాగ్నోసిస్ విభాగంలో సేవలందించి విలువైన అనుభవాన్ని సంపాదించిన అనంతరం స్వస్థలమైన నల్లగొండలో ఈ వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన స్కానింగ్, నిర్ధారణ సేవలు అందించేందుకు తమ బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్రి శ్రీనివాసరెడ్డి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ మాజీ జడ్పిటిసి వంగిరి లక్ష్మయ్య ,డాక్టర్ తల్లి దండ్రులు రూతమ్మ-భీమయ్య, కుటుంబ సభ్యులు శిల్పాదేవి- సంతోష్ కుమార్, గ్రీష్మ -డానియల్ తదితరులు పాల్గొన్నారు. భీమయ్య, ఆయన కుమార్తెలు అతిథులను ఘనంగా సత్కరించారు. వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని, శ్రీ రూబీ స్కాన్ సెంటర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments