చీకటి వెలుగు నల్లగొండ
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డ్ ఆధ్వర్యంలో మలక్పేట యశోద డాక్టర్ల సహకారంతో స్థానిక లయన్స్ భవన్లో ఉచిత ఆర్తో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆర్థోపెడిక్ డాక్టర్ కీర్తి పాలడుగు,డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, మోకాళ్ల నొప్పులు ఇతర కీళ్ల నొప్పులు ఉన్న పేషెంట్లకు పరీక్షలు జరిపి తగిన మందులను అందజేశారు అలాగే సర్జరీ అవసరం ఉన్నవాళ్ళకు ఆసుపత్రికి రావాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గోల్డ్ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ కార్యదర్శి ఇటికాల రవికుమార్ కోశాధికారి చుక్కల్ల రవీంద్ర చారి బాల బ్రహ్మాజీ మదనాచారి వెంకటేశ్వర్లు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments