పార్టీ శ్రేణుల సమక్షంలో క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్
జిల్లా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ:
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శనివారం నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్ పాల్గొని పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. జిల్లా అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆయన విశేషంగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
మంత్రి పుట్టినరోజు సందర్భంగా పలువురు కార్పొరేటర్లు, అభిమానులు, ఫ్రూట్ అసోసియేషన్ సభ్యులు కలిసి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అలాగే నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో కూడా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments